జాతీయ వార్తలు

అడ్మిషన్లకు ఆధార్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాఠశాలలు విద్యార్థుల ప్రవేశానికి ఆధార్‌ను తప్పనిసరిగా చేసే నిబంధనను అమలు చేయరాదని, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని ఆధార్ కార్డులను రూపొందించే యూఐడీఎఐ పేర్కొంది. ఢిల్లీలో వచ్చే ఏడాదికి సంబంధించి 1500 నర్సరీ, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. కొన్ని పాఠశాలల్లో యాజమాన్యాలు
విద్యార్థులకు తప్పనిసరిగా ఆధార్ ఉండాలని వత్తిడి చేస్తున్నారు. ఆధార్ కార్డులను ఇవ్వాలని , ఈ డాక్యుమెంట్ అవసరమని విద్యార్థుల తల్లితండ్రులనుకోరుతున్నరు. ఇలా అడగడం తప్పని, చట్టవిరుద్ధమని యూఐడీఎఐ పేర్కొంది. ఆధార్ కార్డు చూపిస్తేనే ప్రవేశంకల్పిస్తామని చెప్పడం అర్థరహితమని, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడరాదని ప్రకటనను విడుదల చేశారు. ఈ వివరాలను యూఐడీఎఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే చెప్పారు. ఆధార్‌కు, పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధం లేదని ఆయన చెప్పారు. పాఠశాలల్లో ప్రవేశానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తే కోర్ట్ధుక్కారం కింద కేసు నమోదు చేయవచ్చన్నారు. ఆదార్ కార్డుపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిందని, కాని బ్యాంకు అకౌంట్లు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు, పాఠశాలల్లో ప్రవేశాలకు తప్పనిసరి కాదని పేర్కొన్నదని అజయ్ భూషణ్ పాండే చెప్పారు. పాన్ కార్డు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ తప్పనిసరి అన్నారు. సంక్షేమ పథకాల్లో కూడా ఆధార్ తప్పనిసరి చేశామన్నారు.