జాతీయ వార్తలు

నేడు ప్రధానితో కేసీఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్టు టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటనను ముంగించుకుని కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం తుగ్లక్ రోడ్‌లో ఉన్న తన ఇంటికే పరిమితమైన కేసీఆర్ బుధవారం పార్టీ నాయకులతో ఫెడరల్ ఫ్రండ్ ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నాయకులతో చర్చలు జరపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రధానంగా ఎస్పీ, బీఎస్పీ అధినేతలను కేసీఆర్ కలవవచ్చునని పార్టీ నాయకులు వెల్లడించారు. అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానిని ముఖ్యమంత్రి కలవనున్నారు. ఎన్నికల్లో గెలుపు, ఫెడరల్ ఫ్రంట్ దిశగా తాను వేస్తున్న అడుగులు తదితర అంశాలు ప్రధానితో చర్చించనున్నారు.