జాతీయ వార్తలు

సమాధానాల దాటవేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమిళనాడు, పుదుచ్ఛేరి బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. మధ్యతరగతి ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం వారి సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఓ బీజేపీ కార్యకర్త ప్రధానిని నిలదీశారు. ఆ ప్రశ్నకు మోదీ ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని వీడియోకాన్ఫరెన్స్‌నే ప్రధానంగా తీసుకుని ట్వీట్ చేశారు. సామాన్య కార్తకర్త అడిగిన ప్రశ్నను దాడవేసే మీ ఐడియా బావుంది.. దానికి కచ్చితమైన సమాధానం చెప్పిఉండాల్సింది అని రాహుల్ వ్యాఖ్యానించారు. సమాధానాలు దాటవేసే మోదీకి విలేఖరుల సమావేశం ఏం పెడతారు? ఏం చెబుతారు?అని కాంగ్రెస్ చీఫ్ చురకలంటించారు.