జాతీయ వార్తలు

దేవుళ్లకు కులాలు అంటగడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర, డిసెంబర్ 25: భగవాన్ హనుమాన్‌పై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ అధినాయకత్వం వివరణ ఇవ్వాలని శంకరాచార్య అధోషాజనంద దేవ్ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మంత్రులు, బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు భగవాన్ హనుమాన్‌పై కులపరమైన వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు ఆదివాసీ దళితుడు అని పేర్కొన్నారని, క్రీడల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి మాత్రం జాట్ సామాజిక వర్గంకు చెందినవారన్నరని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్సీ భుక్కల్ నవాబ్ హనుమంతుడు ముస్లిం అన్నారని చెప్పారు. ఒకవైపు రామమందిర నిర్మాణాన్ని చేపడుతామంటూనే, హిందూ దేవుళ్లకు కులాలను అంటగడుతూ బీజేపీ నేతలు మాట్లాడడం సరికాదన్నారు. దేవుళ్లకు కులాలను అంటగట్టడం, మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ద్వారా మన సంస్కృతిని కించపరిచారన్నారు.