జాతీయ వార్తలు

అయోధ్యపై జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 25: అయోధ్య స్థల వివాదానికి సంబంధించిన కేసును త్వరితగతిన విచారించాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్పును ఇవ్వగలిగిన సుప్రీంకోర్టు అదే తరహాలో దశాబ్దాలపాటు పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. అఖిల భారత ఆదివక్త పరిషత్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన రవిశంకర్ ప్రసాద్ ‘రామజన్మభూమి కేసు పరిష్కారం విషయంలో సత్వర విచారణ చేపట్టాలని నేను వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నాను. శబరిమల విషయంలో త్వరితగతిన తీర్పు ఇవ్వగలిగినప్పుడు అదే రకమైన సత్వర నిర్ణయాన్ని కూడా అయోధ్య విషయంలో తీసుకునే అవకాశం ఉంటుంది’ అని తెలిపారు.
గత 70 సంవత్సరాలుగా రామజన్మభూమి వివాదం పెండింగ్‌లోనే ఉందని, దీని పరిష్కారంలో ఇది ఎంతమాత్రం జాప్యం జరగడానికి వీల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎం.ఆర్.షా, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాధుర్ కూడా పాల్గొన్నారు. బాబర్‌ను మనమెందుకు పూజించాలని ప్రశ్నించిన రవిశంకర్ ప్రసాద్ రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ ‘రాముడు, కృష్ణుడు, అక్బర్ పేర్లు ఉన్నాయి కానీ బాబర్ పేరు లేదు. మనం ఈ రకమైన అంశాల గురించి మాట్లాడితే మరో వివాదానికి తెరతీసినట్లు అవుతుంది’ అని అన్నారు.