జాతీయ వార్తలు

28మందితో కమల్‌నాథ్ కేబినెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, డిసెంబర్ 25: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంగళవారం 28 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు మంత్రులుగా నియమితులయ్యారు. గవర్నర్ ఆనందీ బెన్ 28 మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయింరు. ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అకీల్ అనే ఏకైక ముస్లిం ఎమ్మెల్యేకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రివర్గంలో గోవింద్ సింగ్, ఆరిఫ్ అకీల్, బాలా బాచాచన్, సజ్జన్‌సింగ్ వర్మ, విజయ్ లక్ష్మి సధో, హుకుం సింగ్ కరాడా, తులసి సిలావత్, ప్రభురాం తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. విజయ్ లక్ష్మి సాదో, ఇమరతి దేవి అనే మహిళలకు మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
మంత్రివర్గంలో స్థానం కోసం చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ప్రచార కమిటీ సారథి జ్యోతిరాధిత్య సింధియా, దిగ్విజయ్‌సింగ్ చర్చించి మంత్రివర్గం కూర్పును ఖరారు చేశారు. ఈ జాబితాకు ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాందీ ఆమోదం లభించింది. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 సీట్లు, బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

చిత్రం..ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పాదాలకు మొక్కుతున్న మధ్యప్రదేశ్ మంత్రి