జాతీయ వార్తలు

ఢిల్లీలో మళ్లీ ‘బేసి-సరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ విషమిస్తున్న వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘ ప్రైవేటు వాహనాలను క్రమబద్ధం చేయడానికి అవసరమైతే బేసి-సరి నంబర్ విధానం అమలు చేస్తాం’అని మంగళవారం ఇక్కడ ప్రకటించారు. కాలుష్య తీవ్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో కాలుష్యకారక ప్రైవేటు వాహనాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిలో కాలుష్య స్థాయిని సాధ్యమైంత మేరకు తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేజ్రీవాల్ వెల్లడించారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ఎన్విరాన్‌మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ(ఈపీసీఏ) రంగంలోకి దిగింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నిర్మాణ పనులు ఆపేయాలని సోమవారం ఈపీసీఏ ఆదేశించింది. బుధవారం వరకు ఇది అమల్లో ఉంటుంది. ‘తప్పని పరిస్థితుల్లో బేసి-సరి నెంబర్ల విధానం అవసరమైతే కచ్చితంగా అమలుచేస్తాం’అని సీఎం స్పష్టం చేశారు. కాలుష్య నివారణకు సంస్థలు,పౌరులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టామని కేజ్రీవాల్ చెప్పారు. కాలుష్య నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అన్న ప్రశ్నకు‘కేంద్రం కూడా పొరుగురాష్ట్రాల ప్రభుత్వాలను పిలిచి మాట్లాడాలి. ఎందుకంటే గాలికి సరిహద్దులుండవు’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అక్టోబర్-నవంబర్ మాసాల్లో మూడు వారాల పాటు నగరం వాయు కాలుష్యంతో అల్లాడిపోయింది. పక్కరాష్ట్రాల్లో వ్యర్థాలు దగ్ధం చేయడంతో పొగ ఢిల్లీని కమ్మేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఫలితం ఉండదని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. ఇలా ఉండగా నాలుగో రోజూ బుధవారం కూడా వాయు కాలుష్యంతో రాజధాని ఉక్కిరిబిక్కిరైంది. పారిశ్రామిక ప్రాంతాలైన వాజీపూర్, మండ్కా, నారేలా, భావనా, సాహిబాబాద్, ఫరిదాబాద్‌లో సంస్థలు బుధవారం కూడా మూసివేస్తారు. ఈమేరకు ఈపీసీఏ చైర్మన్ భూరేలాల్ యాజమాన్యాలకు లేఖలు రాశాలు. కాగా పౌరులు ప్రైవేటు వాహనాలు వినియోగం తగ్గించుకుని ప్రజా రవాణాను సద్వినియోగం చేసుకోవాలని వాతావరణశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.