జాతీయ వార్తలు

ఐదేళ్ల తర్వాత ఇంటికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలీగఢ్, డిసెంబర్ 25: ఐదేళ్ల క్రితం తప్పిపోయిన బాలి క.. అందులోనూ మానసిక దివ్యాంగురాలు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఇదేదో సినిమా సీను కాదు.. నిజజీవితంలోనూ ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగానే జరుగుతుంటాయి. వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ల క్రితం 12ఏళ్ల వయసులో చంచల తన తల్లిదండ్రులతో కలిసి కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లింది. అదే సమయంలో పెనువిపత్తు సంభవిం చి వరద నీటిలో ఈ కుటుంబం చెల్లాచెదురైంది. చంచల తండ్రి వరదల్లో చనిపోగా తల్లి ఎలాగోలా బతికి బయటపడింది. అయితే చంచల జాడ మాత్రం తెలియలేదు. ఆ పిల్ల కూడా చనిపోయి ఉంటుందని అందరూ భావించారు. అకస్మాత్తుగా చంచల సోమవారం తన తాత హరీష్‌చంద్ర, నానమ్మ శకుంతలాదేవి వద్దకు చేరుకుంది. ఇప్పుడు ఆమె వయస్సు 17 ఏళ్లు. కేదార్‌నాథ్‌లో తప్పిపోయిన చంచల జమ్ములోని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమానికి చేరింది. అలీగఢ్‌లోని మరో స్వచ్ఛంద సేవా సంస్థ సహాయంతో ఆ బాలికను బంధువులకు అప్పగించారు. కొద్ది రోజులనుంచి చంచల అలీగఢ్ నగరానికి సంబంధించిన చిత్రాలను గుర్తుపట్టడం జరిగిందని చైల్డ్‌లైన్ సంస్థ తెలిపింది.