జాతీయ వార్తలు

1961 వంశధార ఒప్పందంపై జనవరి 27న ట్రిబ్యునల్ తుది తీర్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: వంశధార 1961 ఒప్పందాన్ని మరోసారి ఆంధ్రా-ఒడిశా ప్రభుత్వాల అధికారులతో సమీక్షించాల్సి ఉందని, జనవరి 27న ఢిల్లీ లేదా పూరీ కేంద్రంగా ఈ ఒప్పందంపై చర్చలు నిర్వహిస్తామని వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ముకుందకం శర్మ నిర్ణయించారు. ఆంధ్రాలో నేరడి వద్ద నిర్మించనున్న బ్యారేజీ వల్ల ఒడిశాకు నష్టం తక్కువేనన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తూ 106 ఎకరాల వ్యవసాయ భూములకు ఏపీ సర్కార్ నష్టపరిహారం చెల్లించాల్సిందేనంటూ నిర్ణయించారు. అలాగే, వరద ముంపునకు గురై గ్రామాలను రక్షించేలా 3.6 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. మంగళవారం ఒడిశా రాష్ట్రం వంశధార నదీ పరివాహక ప్రాంతాలైన కాశీనగర్ బ్లాక్‌లో షరా, బడిగాం, కిడిగాం, పురిటిగూడ గ్రామాల ప్రజలు, రైతులతో ట్రిబ్యునల్ క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలను రికార్డు చేసింది.
జీరో పాయింట్‌పై చర్చలు జరగాల్సిందేనని, 1961 అగ్రిమెంటుపై ఉభయరాష్ట్రాల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన తర్వాతే తుది తీర్పు వెలువడుతుందంటూ ట్రిబ్యునల్ సభ్యులు గజపతి జిల్లా కలెక్టర్ అనూప్‌కుమార్ సాహుతో స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా నీటి ప్రవాహం కొలతలు తీసుకున్న తర్వాత నీటి మట్టం లోతును పరిశీలించి రికార్డు చేసారు. కెనాల్స్ నిర్మాణం వద్ద కొత్తగా ఒడిశా ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు ప్రతిపాదించిన అంశాలు తెలుసుకున్న అనంతరం ఒడిశా రాష్ట్రానికి నేరడి బ్యారేజీ నిర్మాణం, ఆంధ్రాలో వంశధార జలవివాదాన్ని జఠిలం చేసేంతటి ఆస్కారం లేదన్న భావన వ్యక్తం చేసారు. అలాగే, తాగునీటి సమస్యలు కూడా తలత్తే కొన్నిగ్రామాలు ఉన్నాయంటూ ఒడిశా కలెక్టర్‌తోపాటు, అక్కడ న్యాయ కోవిదులు, ఇంజనీరింగ్ అధికారులు ట్రిబ్యునల్ ముందు చెప్పగా, ఆ ప్రాంతాలను సైతం ట్రిబ్యునల్ పర్యటించింది. తాగునీటి సమస్యల పట్ల అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యలపై అభ్యంతరాలు ప్రజల నుంచి అధికారులు చెప్పినంతగా వెల్లడి కాకపోవడంతో ట్రిబ్యునల్ ఆ ప్రతిపాదనలపై శ్రద్ధ వహించలేదు. సుమారు 20 కిలోమీటర్లలో 10 నుంచి 15 గ్రామాలకు ముంపు భయం ఉంటుందన్న ఒడిశా సర్కార్ ప్రతిపాదనను కూడా ట్రిబ్యునల్ కొట్టిపారేసినట్టే వ్యవహారించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన వంశధార ట్రిబ్యునల్ భువనేశ్వర్ బయరుదేరింది.
ఇదిలా ఉండగా, సోమవారం ఆంధ్రప్రదేశ్ (శ్రీకాకుళం)లో ట్రిబ్యునల్ క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలు, రికార్డులు చేసిన అంశాలకు, మంగళవారం ఒడిశాలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనల్లో గల వ్యత్యాసాలు ఎక్కువ శాతం కన్పించడంతో తుది నిర్ణయాన్ని వచ్చే నెల 27 వరకూ వాయిదా వేస్తూ ఢిల్లీ లేదా పూరీ కేంద్రంగా ఆంధ్రా-ఒడిశా కలెక్టర్లు, జలవనరులశాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, డిడబ్ల్యూసి అధికారులు, న్యాయకోవిదులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి తుది నిర్ణయంలో అత్యంత అవసరమైన 1961 వంశధార జలవివాదంపై జరిగిన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించనున్నట్టు చైర్మన్ జస్టిస్ ముకుందకంశర్మ స్పష్టం చేసారు.
చిత్రం..కాశీనగర్ బ్లాక్‌లో షరా నదీపరివాహక తీరంలో పరిశీలిస్తున్న జస్టిస్ ముకుందకం శర్మ, తదితరులు