జాతీయ వార్తలు

భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన పది మంది ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద అనుమానితులను నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ అనుమానితులు రాజకీయనాయకులు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతి దాడులకు పాల్పడాలని పన్నాగం పన్నినట్లు ఎన్‌ఐఏ పోలీసులు చెప్పారు. ఢిల్లీ పరిసరాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో పేలుళ్లకు రచన చేశారు. సకాలంలో వచ్చిన నిఘా సమాచారం మేరకు ఏకకాలంలో వివిధ ప్రదేశాల్లో దాడులు చేసి కుట్రను భగ్నం చేసినట్లు ఎన్‌ఐఏ ఐజీ అలోక్ మిట్టల్ చెప్పారు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్ లాంచర్‌తో పాటు బాంబులను అమర్చిన వందకుపైగా గడియారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17 ప్రదేశాల్లో పోలీసులు భద్రతా బలగాల సహాయంతో సోదాలు చేశారు. ఢిల్లీ, మీరట్, అమ్రోహా, లక్నో నగరాల్లో ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేశారు. హర్కత్ ఉల్ హర్బ్ ఇ ఇస్లాం గ్రూపుకు చెందిన 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 16 మందిలో పది మందిని అరెస్టు చేశామని, మిగతా వారిని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు చెప్పారు. అమ్రోహాలో ఐదుగురిని, శీలాపూర్, జాఫ్రాబాద్‌లో ఐదుగురిని, మిగతా వారిని ఇతర ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారికి నేర చరిత్ర ఉందని, వీరు ఉగ్రవాద సిద్ధాంతాలకు ఆకర్షితులై ఐఎస్‌ఐఎస్‌లో చేరారని పోలీసులు చెప్పారు. వీరు తయారుచేసిన బాంబులను స్వాదీనం చేసుకున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఎల్‌ఈడీలను పేల్చే సాంకేతిక పరిజ్ఞానం వద్ద వీరి వద్ద ఉంది. ఈ దాడుల్లో పేలుళ్ల సూత్రధారి 29 ఏళ్ల మహ్మద్ సోహాలీ ఉన్నారు. నోయిడా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థి, అలాగే ఒక డిగ్రీ విద్యార్థ్ధి, ఇద్దరు వెల్డర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 పిస్టళ్లు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లు, వంద మొబైల్స్, 135 సిమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రూ.7.5 లక్షల నగదను, వంద అలారమ్ క్లాక్‌లు కూడా కనుగొన్నామని ఎన్‌ఐఏ ఐజీ మిట్టల్ చెప్పారు. బాంబు తయారీలో ఉపయోగించే 25 కిలోల పోటాషియం నైట్రేట్, క్లోరేట్, చక్కెర పేస్ట్, సల్ఫర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనుమానితులు వాట్సప్, టెలిగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పరం సంబంధాలు కలిగి ఉన్నట్లు, ఎప్పటికప్పుడు సమాచారం మార్చుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఉత్తరప్రదేశ్ పోలీసు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ సహకారంతో ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం, ఆరెస్సెస్ కార్యాలయం వెలుపల విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు పోలీసులు చెప్పారు.
చిత్రాలు.. అరెస్ట్ అయిన అనుమానితుడిని తరలిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు
*మీడియాతో మాట్లాడుతున్న ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్ జనరల్ అలోక్ మిట్టల్
*స్వాధీనం చేసుకున్న ఆయుధాలు