జాతీయ వార్తలు

ఫ్రంట్‌కు పదునేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిపిన సుదీర్ఘ సమావేశంలో దేశ రాజకీయాలపై సమాలోచన జరిపినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపిన నేపథ్యంలో బుధవారం నరేంద్ర మోదీతో చర్చలు జరపటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. నరేంద్ర మోదీని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ నాయకత్వంలో జాతీయ ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తుంటే, ఆయన ప్రత్యర్థిగా మారిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ రాజకీయ అతిరథులు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఫెడరల్ ప్రంట్ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుతోపాటు ప్రధాన మంత్రి ఎవరనేది నిర్ణయించటంలో కీలకపాత్ర నిర్వహించనున్నారు. అందుకే ఈ ముగ్గురు నాయకులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని జాతీయ ప్రజాఫ్రంట్, చంద్రశేఖరరావు ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ రెండు గ్రూపులకు సమదూరంలో ఉంటూ రాజకీయం చేస్తున్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి చర్చల్లో ఇలాంటి పలు అంశాలు సమీక్షకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారతాయనేది అందరికీ తెలిసిందే. ‘శతృవుకు శతృవు మనకు మిత్రుడు’ అనే సిద్ధాంతం ఆధారంగా ఆయా గ్రూపుల ఏర్పాటు జరిగి జయాపజయాల నిర్ణయం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. లోక్‌సభతోపాటు జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం విజయావకాశాలు ఎలా ఉన్నాయి? వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి బహిరంగ సభకు హాజరవుతున్న వేలాది మంది ఎన్నికల్లో ఆయనకే ఓటు వేస్తారా? ఓటు వేసే పక్షంలో తెలుగుదేశం పరిస్థితి ఏమిటి? అనేది కూడా ఇరువురు నాయకులు చర్చించి ఉంటారని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారంలో కొనసాగేందుకు ఎన్‌డీఏ అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనే అంశంపై చంద్రశేఖరరావు పలు సూచనలు, సలహాలు ఇచ్చి ఉంటారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. చంద్రశేఖరరావు గతంలో నరేంద్ర మోదీని కలిసినప్పుడు వివిధ అభివృద్ధి పథకాల అమలుపై పలు సూచనలు, సలహాలు ఇవ్వటం తెలిసిందే.
రాబోయేది లోక్‌సభ ఎన్నికల కాలం కాబట్టి ఆయన ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి ప్రధానితో చర్చించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-టీఆర్‌ఎస్ కలిసి పోటీ చేయకపోయినా ఒక అవగాహనతో పని చేసే ఆవకాశాలు లేకపోలేదనే మాట చాలాకాలం నుండి వినిపిస్తోంది. ఇరువురు నాయకుల మధ్య ఈ దిశగా చర్చలు జరిగి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చిత్రం..బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు