జాతీయ వార్తలు

అధికారం కోసమే మమ్మల్ని వదులుకున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 26: ‘అధికారం కొందరికి ఆక్సిజన్‌లా పనిచేస్తుంది’ అని ఇటీవల బీజేపీ చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ బుధవారం మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ఆ అధికారం కోసమే 2014లో తమతో పొత్తును బీజేపీ తెగ్గొట్టుకుందని శివసేన విమర్శించింది. ‘కొంతమందికి అధికారం ఆక్సిజన్‌లా పనిచేస్తుంది, వారు రెండు, మూడేళ్లు అధికారంలో లేకపోతే వారిలో అసహనం కట్టలు తెచ్చుకుంటుంది, విపక్ష స్థానంలో కూర్చోవడానికి అస్సలు ఇష్టపడరు’ అని సోమవారం జరిగిన కార్యక్రమంలో మోదీ ఎవరినీ ఉద్దేశించకుండా పరోక్ష విమర్శలు చేశారు. దీనిపై శివసేన తన పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో మోదీ వైఖరిని ఎండగట్టింది. పూర్తిగా అధికారాన్ని దక్కించుకోవడానికే 2014 ఎన్నికల్లో తమ పార్టీతో బీజేపీ బంధాలు తెంచుకుందని, అధికారానికి ఆక్సిజన్‌ను అందిస్తున్న హిందుత్వ ట్యూబ్‌లను ప్రజలు లాగేస్తుండటంతో వాస్తవాన్ని తెలుసుకున్న బీజేపీ ఇప్పుడు తాము శివసేనతోనే ఉంటామంటూ ప్రకటనలు గుప్పిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా తమకు వస్తున్న వ్యతిరేకతను గుర్తించి వచ్చే ఎన్నికల్లో పదవిలోకి రావడానికి బీజేపీ ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణం, ఎల్‌కే అద్వానీల పేర్లు మళ్లీ తెరపైకి తీసుకువస్తోందని అన్నారు.