జాతీయ వార్తలు

కేసీఆర్‌ను త్వరలోనే కలుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో కలుసుకుంటానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ బుధవారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ ముందు నిర్ణయించిన ప్రకారం తాను 25 లేదా 26న ఢిల్లీకి వెళ్లి చంద్రశేఖరరావుతో సమావేశం కావలసి ఉండింది.. అయితే కొన్ని ముఖ్యమైన పనుల మూలంగా తాను ఢిల్లీకి వెళ్లలేకపోయానని చెప్పారు. జనవరి ఆరోతేదీ తరువాత హైదరాబాద్‌కు వెళ్లి చంద్రశేఖరరావుతో సమావేశం అవుతానని ఆయన ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమని ఆయన చెప్పారు.