జాతీయ వార్తలు

ఏపీ హైకోర్టు సీజేగా ప్రవీణ్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం విడివిడగా ప్రకటనలు విడుదల చేసింది. జనవరి 1నుంచి ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. అలాగే న్యాయమూర్తులు ఆర్‌ఎస్ చౌహన్, రామ సుబ్రమణియన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా కేటాయిస్తున్నట్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఉమ్మడి హైకోర్టు విభజిస్తూ రాష్టప్రతి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే హైకోర్టు విభజన, న్యాయ
మూర్తులను కేటాయింపులు జరిగినప్పటికీ ప్రధాన న్యాయమూర్తులు ఎవరవేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. దీంతో కేంద్ర న్యాయశాఖ ఈ నియామకాలను జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టులో మొత్తం 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 14 మంది, తెలంగాణ 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కేటాయించిన న్యాయమూర్తులలో అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రధాన న్యాయమూర్తిగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 14 మంది, తెలంగాణకు 13 మంది న్యాయమూర్తులు పని చేయనున్నారు.

చిత్రాలు.. ఏపీ హైకోర్టు సీజేగా ప్రవీణ్‌కుమార్ * తెలంగాణకు రాధాకృష్ణన్