జాతీయ వార్తలు

ఆ గుర్తులు ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: తెలంగాణ ఎన్నికల్లో ఇస్ర్తిపెట్టె, ట్రక్కు, కెమెరా గుర్తులను కేటాయించవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలి ఉన్నాయని ఆయన అన్నారు. ఓటర్లు గుర్తించే విధంగా ఎన్నికల గుర్తులు ఉండాలేతప్ప, గందరగోళానికి గురిచేసే విధంగా ఉండరాదని ఈసీకి ఆయన వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఈసీకి కృతజ్ఞతలు తెలిపారు. అరోరాతో సమావేశానంతరం కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ ఇస్ర్తీపెట్టే, ట్రక్కు, కెమెరా గుర్తులపై ఈసీతో సీఎం కేసీఆర్ చర్చించినట్టు తెలిపారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో టీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగిందని, ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తెచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘కారు’ గుర్తును పోలిన ‘ట్రక్కు’ గుర్తుతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారని
ఆయన అన్నారు. 15 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులకు పది వేలకు పైగా ఓట్లు తగ్గి నష్టం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో నష్టపోయిన విషయాన్ని కేసీఆర్ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వినోద్ తెలిపారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్న దృష్ట్యా తెలంగాణలో ‘కారు’ను పోలిన గుర్తులను కేటాయించవద్దని కేసీఆర్ కోరారు. టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తుకు తేలికపాటి రంగు వేశారని దాన్ని పెంచాలని పార్టీ అధినేత విజ్ఞప్తి చేశారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం ఎన్నికల ప్రధానాధికారితో సమావేశం అనంతరం
నిర్వచన్ సదన్ నుంచి వెలుపలకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్