జాతీయ వార్తలు

ఏపీ వివరాలివ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్ నివేదికలో వెల్లడించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఇప్పటికి వివరాలు ఏవీ అందజేయలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఉక్కు కార్మాగరం ఏర్పాటుకు అవసరమైన గనుల లభ్యత, ముడి ఇనుము నిల్వలకు సంబంధించి వివరాలు అందించలేదని తెలిపింది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం శంకుస్థాపన చేసి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ముడి ఇనుము లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు తీసుకుంటుందని అన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌పై ఉన్నత స్థాయి ట్రాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించింది. టాస్క్ఫోర్స్ ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నెల 17న టాస్క్ఫోర్స్ సమావేశం జరిగిందని పేర్కొన్నారు. టాస్స్‌పోర్సు నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కేంద్రం తప్పుపట్టింది.
పని తక్కువ ఆర్భాటం ఎక్కువ: జీవీఎల్
ఉత్తుత్తి స్టీల్ ప్లాంటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసి మరొక డ్రామాకు తెరలేపారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుఆరోపించారు. ఎటువంటి అమలుకు నోచుకోని చంద్రన్న శంకుస్థాపన రాళ్లు రాయలసీమలో చాలా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీకి న్యాయం చేయండి:
టీడీపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్‌కు న్యాయం చేయాలని తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ అవరణలో తన నిరసనను గురువారం కూడా కోనసాగించారు. పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు ఆంధ్రపదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. పార్లమెంట్ సమావేశాలలో వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీ ఎన్ శివప్రసాద్ గురువారం కూడా అదే కొనసాగించారు.