జాతీయ వార్తలు

ఇక్కడ మైనార్టీలు సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భారత్‌లో మైనార్టీలకు వచ్చిన ఢోకా ఏమీ లేదని, వారికి మంచి భద్రత మధ్య సురక్షితంగా జీవిస్తున్నారని, భారత్‌ను వేలెత్తి చూపే ముందు తన దేశంలో ఏమి జరుగుతుందో చూసుకోవాలని పాకిస్తాన్‌ను కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కోరారు. గత వారం రోజుల్లో నక్వీ రెండోసారి పాక్ ప్రధాని ఇమ్రాన్‌పై ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌లో మైనార్టీలను మెజార్టీప్రజలతో సమానంగా చూస్తామని జిన్నా కలలను నెరవేరుస్తామని లాహోర్‌లో ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పాక్‌లో మైనార్టీలకు సమానంగా చూస్తున్నానన్నారు. భారత్‌లో మైనార్టీలు అభద్రతతో ఉన్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై నక్వీ స్పందించారు. పాకిస్తాన్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, ఈ విషయమై పరిశీలించుకోవాలన్నారు.
భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు సమాన హక్కులు ఇచ్చిందన్నారు. భారత్ సహనానికి ప్రతీకన్నారు. ఇతర వర్గాలతో సమానంగా ఇక్కడ మైనార్టీలు అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నోరు జారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు పెద్దగా పరిజ్ఞానం లేదన్నారు. పాకిస్తాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు 1947లో విభజన సమయంలో 23 శాతంగా ఉండేవారన్నారు. కాగా ఈ రోజు 1.2 శాతానికి మైనార్టీల జనాభా వచ్చిందన్నారు. పాక్‌లో ఉన్న హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులను ఆ దేశం ఊచకోత కోసిందని, ఇతర మతంలోకి బలవంతంగా మార్చిందని, లేదా భారత్ ఇతర దేశాలకు వెళ్లి ఉంటారని చెప్పారు.