జాతీయ వార్తలు

భూకంపాల గురించి చెప్పేస్తాయ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూర్కీ, డిసెంబర్ 27: భూకంపాలను పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూర్కీలోని ఐఐటీ శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. భూకంపం వస్తుందని ప్రజలను ముందే హెచ్చరించేందుకు అవసరమైన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసినట్టు శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ప్రజలకు కొద్ది నిమిషాలు ముందే హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణనష్టం నివారించవచ్చని అన్నారు. ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెట్‌వర్క్ పనిచేస్తోందని శాస్తవ్రేత్తలు తెలిపారు. భూగర్భంలో పొరల్లో సంభవించే ప్రకంపనలను తాము అభివృద్ధి చేసే సెన్సర్స్ ముందే పసిగడతాయని వారు స్పష్టం చేశారు.‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం భూకంపాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వడంలేదు. ఒక విధంగా కచ్చితమైన ఫలితాలు ఇవ్వడంలేదు. ప్రజలు కూడా ఏవోవో గణాంకాలను ఆశ్రయిస్తున్నారు. అవీ కూడా పనిచేయడం లేదు’అని రూర్కీ ఐఐటీ ప్రొఫెసర్ ముకత్‌లాల్ శర్మ అన్నారు. భూకంపానికి సంబంధించి హెచ్చరికలు కొద్ది నిమిషాల ముందే ఇచ్చే వ్యవస్థను తాము అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు. అయితే ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధానం ఉంటుందని ఆయన తెలిపారు. రూర్కీలో పది సెకన్ల నుంచి నిమిషం ముందు ప్రజలను అప్రమత్తం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. హిమాలయ ప్రాంతమైన డెహ్రడూన్‌లో పది సెకన్ల నుంచి నిమిషం, న్యూఢిల్లీలో ఒక్క నిమిషం ముందే తెలుస్తుందని ఆయన చెప్పారు. దీని వల్ల అప్పటికప్పుడు మొత్తం ఇళ్లను వదిలి వచ్చేయడం సాధ్యం కాదని, అయితే భారీ ప్రాణనష్టం నివారించడంతోపాటు స్వల్ప గాయాలతో బయటపడడానికి వీలుంటుందని ప్రొఫెసర్ శర్మ స్పష్టం చేశారు. రూర్కీ ఐఐటీలో భూకంపాల ఇంజనీరింగ్‌పై జరిగిన 16వ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘కొద్ది నిమిషాల ముందైనా హెచ్చరికలు చేస్తే భారీ నష్టం నివారించవచ్చు’అని అన్నారు. ‘అణు విద్యుత్ కేంద్రాలు, మెట్రో రైళ్లు, గ్యాస్ సరఫరాను నిలిపివేయవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.