జాతీయ వార్తలు

ఇక చాలు.. బైటికి పంపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ గొడవ చేసే సభ్యులను సభనుండి బైటికి పంపించేస్తానని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హెచ్చరించారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ హెచ్చరిక చేశారు. మీరిలా వ్యవహరించటం ఎంతమాత్రం బాగా లేదు.. ప్రతిరోజూ పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటం మంచిది కాదు.. అలాచేస్తే సభ్యులను సభనుండి పంపించివేయక తప్పదని హెచ్చరించారు. లోక్‌సభ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కాగానే అన్నా డీఎంకె, కాంగ్రెస్, తెలుగుదేశం సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు జేపీసీని నియమించాలని కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు. కర్నాటక ప్రభుత్వం కావేరీ నదిపై చేపట్టిన మేకదాటు నీటిపారుదలు ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని అన్నా డీఎంకే సభ్యులు నినాదాలిచ్చారు. మీ వాదనలు వినిపించేందుకు జీరో అవర్‌లో సమయం ఇస్తానని సుమిత్రా మహాజన్ పలుమార్లు గొడవ చేస్తున్న సభ్యులతో చెప్పారు. వారుమాత్రం ఇదేదీ పట్టించుకోకుండా పెద్దఎత్తున నినాదాలిస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ప్రతిపక్షం సభ్యుల గొడవలోనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టి మూడు ప్రశ్నలపై చర్చ జరిపారు. ఈ దశలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి ప్రభుత్వం జేపీసీని నియమిస్తే తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇది పద్ధతి కాదని సుమిత్రా మహాజన్ అన్నారు. గొడవ చేస్తున్న సభ్యులను బైటికి పంపించి వేస్తానంటూ.. పోడియం వద్ద నిలబడి నినాదాలిస్తున్న సభ్యుల జాబితా సిద్ధం చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అయినప్పటకీ ఏమాత్రం తగ్గకుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు. దీనితో సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు గొడవ కొనసాగించారు. ఈ గొడవ, గందరగోళం మధ్య స్పీకర్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు.