జాతీయ వార్తలు

కేంద్రం, రాష్ట్రం రెండూ వంచించాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా సాధనకోసం గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘వంచనపై గర్జన’ పేరుతో ఆ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించింది.
ఈ నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లచొక్కలు ధరించి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ప్రత్యేక హోదా విషయంలో యూ-టర్న్ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉండటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణమని వారు స్పష్టం చేశారు. పార్థసారధి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శే్వతపత్రాలన్నీ ఓ బోగస్ అని, నాలుగేళ్లలో చంద్రబాబు ఏపీకి ఏం సాధించారో చెప్పాలని పార్థసారిధి డిమాండ్ చేశారు. సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో ప్రధానితో చంద్రబాబు లాలూచీ పడ్డారని, అప్పుడు ప్యాకేజికి ఒప్పుకున్న చంద్రబాబు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సన్మానం కూడా చేశారని గుర్తుచేశారు. హోదాకోసం పోరాడితే పీడీ యాక్ట్ కింద చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు. పృథ్విరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో మహాకూటమి అనేది సిగ్గుమాలిన కలయికగా అభివర్ణించారు. అందుకే చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. సీ.రామచంద్రయ్య మాట్లాడుతూ నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి తన సొంతత ప్రయోజనాలు నెరవేరలేదని చంద్రబాబు బీజేపీని వదిలేశారని చెప్పారు. ‘ఓటుకు నోటు’ కేసుకు భయపడి చంద్రబాబు విజయవాడకు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను వంచించింది ముమ్మాటికి చంద్రబాబేనని నొక్కి చెప్పారు. నరేంద్ర మోదీని పొగుడుతూ ఎన్నోసార్లు అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని రామచంద్రయ్య వెల్లడించారు.
పార్లమెంట్ ఆవరణలో ధర్నా
ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్‌సీపీ నాయకులు పార్లమెంట్ లోపాలా, బయటా నిరసనలు కొనసాగిస్తున్నారు. విజయ సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అనంత వెంకట రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, వరప్రసాద్ తదితరులు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.