జాతీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో మోదీని దింపేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్. జనవరి 9: రైతులకు న్యాయం చేయడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వానికి హిందీబెల్ట్‌లోని రాష్ట్రాలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు పునరావృతమవుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
బుధవారం ఇక్కడ ఆయన ర్యాలీలో మాట్లాడుతూ రైతులంటే మోదీ ప్రభుత్వానికి గిట్టదన్నారు. రైతుల పట్ల సవతితల్లి ప్రేమను కనపరుస్తున్నారన్నారు. అందుకే రైతులు కేంద్రానికి బుద్ధి చెప్పారన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా చెలగాటమాడుతున్న బీజేపీ సర్కార్‌కు నూకలు చెల్లాయాన్నారు. రైతులకు మేలు చేయాలంటే మనసు రావడం లేదా అని ఆయన ప్రశ్నించారు. మోదీ సర్కార్ అవినీతిలో కూరుకుని పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా రైతులకు ఊరట కలిగించే విధంగా రుణాలను మాఫీ చేస్తామన్నారు. కొత్త హరితవిప్లవం సాధనకు అంకురార్పణ చేస్తామన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్‌పై సమాధానం చెప్పకుండా దాటవేత వైఖరిని అవలంభిస్తున్నారన్నారు. రాఫెల్ డీల్‌పై జేపీసీ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తేకప్పదాటు వైఖరిని అవలంభిస్తున్నారన్నారు. తామడిగిన ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ బదులివ్వలేదన్నారు.
మోదీ రైతులకు, కార్మికులకు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ఏ పనిచేయకుండా ఆడంబరమైన ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

చిత్రం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తో కలిసి
జైపూర్‌లో బుధవారం జరిగిన కిసార్ ర్యాలీలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.