జాతీయ వార్తలు

బిల్లును స్వాగతిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: అగ్రవర్ణాల పేదలకు (ఈబీసీలకు) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం రాజ్యసభలో ప్రతిపాదించిన బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపుర్ణ మద్దతు ఇచ్చింది. ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తు కేంద్రం ప్రతిపాదించిన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ పాల్గొన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లు అగ్రవర్గాల్లో పేదలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఇంత హడావిడిగా ఈ బిల్లును తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని తమ పార్టీ కోరుతున్నప్పటికీ బిల్లును సభలో ప్రవేశపెట్టారని.. అయినప్పటికీ తమ పార్టీ సంపుర్ణ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని సుజనా ప్రశ్నించారు. సీఎం రమేష్ మాట్లాడుతూ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ చివరి రోజు కేంద్రం ప్రతిపాదించడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలో ఇలాగే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ప్రవేశపెట్టిందని, తరువాత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిందని ఆయన గుర్తుచేశారు. ఈబీసీ బిల్లును చట్టం చేసి లబ్ధి పొందాలని చూస్తున్న ఎన్‌డీయే ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రమేష్ జోస్యం చెప్పారు. ఈ చర్చలో కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామ లక్ష్మి కూడా పాల్గొన్నారు.

చిత్రం.. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి