జాతీయ వార్తలు

‘పద్మ’ పురస్కారాల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు సోమవారం రాష్టప్రతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులు అందజేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ హీరాచంద్ అంబానీ, మాజీ గవర్నర్ జగ్‌మోహన్, నటుడు అనుపమ్ ఖేర్, అజయ్ దేవగన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ నృత్యకారులు యామినీ కృష్ణమూర్తి, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, జానపద గాయని మాలిని అవస్థిలకు రాష్టప్రతి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఐదుగురికి పద్మ విభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 43 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేశారు. అలాగే వ్యవసాయ రంగం నిపుణుడు సుభాష్ పాలేకర్, ప్రముఖ చెఫ్ మహ్మద్ ఇంతియాజ్ ఖురేషీలకు పురస్కారం ప్రదానం చేశారు. రిలయన్స్ వ్యవస్థాపకులు దివంగత ధీరూభాయ్ అంబానీకి మరణానంతం ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన సతీమణి కోకిలాబెన్ అంబానీ అందుకున్నారు. ధీరూభాయ్ కుటుంబ సభ్యులు, ఇద్దరు కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే భారత సంతతికి చెందిన అమెరికా దేశస్తుడు, ఆర్థికవేత్త అవినాష్ కమలాకర్ దీక్షిత్, జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్‌మోహన్, భారతీయ నాట్యరంగం అభివృద్ధికి విశేష కృషి చేసిన యామినీ కృష్ణమూర్తి, శ్రీశ్రీ రవిశంకర్‌కు పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రదానం చేశారు. అలాగే ప్రసిద్ధ ఆర్కిటెక్చర్ హఫీజ్ సొరబ్ కాంట్రాక్టర్, అజిత్ గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ బర్జీందర్ సింగ్ హమ్‌డార్డ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, నిర్మాణరంగ దిగ్గజం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ చైర్మన్ పల్లోంజీ షాపూర్జీ మిస్ర్తి, బ్యాడ్మింటన్ సంచలన తార సైనా నెహ్వాల్, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ప్రముఖ శాస్తవ్రేత్త ఎవి రామారావు, ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోయంట్రాలజీ చైర్మన్ దువ్వూరి నాగేశ్వరరెడ్డిలను పద్మభూషణ్‌లతో సత్కరించారు.
ఇస్రో డైరెక్టర్ అన్నాదురై, జానపద గాయని మాలిని అవస్థి, మాస్టర్ కార్డ్ సిఇవో, ప్రెసిడెంట్ అజయ్‌పాల్ సింగ్ బంగా, సినీ దర్శకుడు మధూర్ ఆర్ భండార్కర్, ప్రముఖ హార్మోనిస్ట్ పండిట్ తులసీదార్ బొర్కర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రవీణ్ చంద్ర, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌లతో పాటు 43 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్టప్రతి అందజేశారు. పద్మశ్రీ అందుకున్న వారిలో అస్సాంకు చెందిన సామాజిక కార్యకర్త అజొయ్ కుమార్ దత్తా, గుజరాతీ జానపద కళాకారుడు అభికుందన్ గోవిందభాయ్ గధ్వీ, హృద్రోగ నిపుణులు ఎ గోపాలకృష్ణ గోఖలే, తెలంగాణ చిత్రకారుడు లక్ష్మణ్ గౌడ్, ప్రముఖ నేత్ర వైద్యుడు మహిపతి ఎం జోషి, తమిళనాడుకు చెందిన సంఘ సేవకుడు కందాడై శ్రీనివాసన్ ఉన్నారు.

చిత్రం పద్మ అవార్డు గ్రహీతలతో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్