జాతీయ వార్తలు

వైద్య పరీక్షల కోసం అమెరికాకు జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: వైద్య పరీక్షల నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం రాత్రి హుటావుటిన అమెరికాకు బయలుదేరి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలపై పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 1వ తేదీన అరుణ్ జైట్లీ ఎన్డీఏ సర్కార్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రస్తుత ప్రభుత్వంలో చివరి బడ్జెట్. గత ఏడాది అనారోగ్యంతో జైట్లీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో చేరారు. గత ఏడాది మే 14వ తేదీన కిడ్నీ మార్పిడి శస్తచ్రికిత్స చేయించుకున్నారు. జైట్లీ అనారోగ్యం పాలుకావడంతో, ఆయన స్థానంలో ఆర్థిక శాఖ బాధ్యతలను మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. గత ఏడాది ఏప్రిల్ నెలాఖరు నుంచి ఆయన ఆర్థిక శాఖ కార్యాలయానికి రాలేదు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆగస్టు 23వ తేదీ నుంచి విధులకు హాజరయ్యరు.