జాతీయ వార్తలు

బొగ్గుగనుల్లోంచి మృతదేహం వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/షిల్లాంగ్, జనవరి 17: మేఘాలయలోని బొగ్గుగనిలోకి వెళ్లి చిక్కుకుపోయిన వారిలో ఒకరి మృతదేహాన్ని నేవీ డైవర్స్ కనుగొన్నారు. గనిలోపల కొన్ని పుర్రెలు కూడా ఉన్నట్టు వారు గుర్తించారు. నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ గురువారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ గనిలోపల సుమారు 160 నుంచి 210 అడుగుల లోతున బుధవారం రిమోటెడ్ ఆపరేటెట్ వెహికల్ (ఆర్‌ఓవీ) ద్వారా డైవర్లు ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారని చెప్పారు. అయితే ఆ శరీరం ఎవరిదో ఇంకా గుర్తించలేదని డాక్టర్ల బృందం ఆ మృతదేహాన్ని పరీక్షిస్తోందని చెప్పారు. ఎలుక బొరియా లాంటి దాని ద్వారా గనిలోకి గత ఏడాది డిసెంబర్ 13న అక్రమంగా 15 మంది మైనర్లు ప్రవేశించారు. అయితే అప్పుడే వరదలు రావడంతో వారు అందులోనే చిక్కుకు పోయారు. వారిని వెలికితీయడానికి కోర్టు ఆదేశాల ప్రకారం డిసెంబర్ 30 నుంచి అధికారులు సహాయచర్యలు చేపట్టారు. లోపల ప్రవహిస్తున్న నీటిలో గంధకం శాతం ఎక్కువగా ఉండటం వల్ల మృతదేహాలు త్వరగా పాడైపోయాయని కెప్టెన్ డీకే శర్మ తెలిపారు. నేవీ డైవర్స్‌కు లోపల పలు పుర్రెలు ఉన్నట్టు ఆర్‌ఓవీ ద్వారా కన్పించిందని ఆయన చెప్పారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడం చాలాక్లిష్టమైనదని పైగా చాలారోజులు కావడం వల్ల వారందరూ మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.