జాతీయ వార్తలు

మార్చిలో ఎన్నికల షెడ్యూల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: లోక్‌సభ ఎన్నికలను ఈ ఏడాది ఏప్రిల్, మేలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను మార్చ్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు తెలిసింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిసా, సిక్కిం, జమ్మూకాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ఏప్రిల్, మేలో ఆరు లేదా ఏడు దశల్లో జరుగవచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. పార్లమెంటు బడ్జెట్-ఓట్‌ఆన్ అకౌంట్ సమావేశాలు ఈనెల 31న ప్రారంభమై ఫిబ్రవరి 13 తేదీ ముగిసే అవకాశాలున్నాయి. పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో చర్చలు జరిపి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయటం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రతా దళాల మోహరింపు తదితర అంశాలపై చర్చలు జరపటం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులను అవసరమున్నచోట బదిలీ చేసే ప్రక్రియను కూడా చేపట్టింది. గత ఎన్నికల సమయంలో ముఖ్య ఎన్నికల అధికారులుగా పనిచేసిన వారు అదే పదవిలో కొనసాగకుండా చూస్తోంది. అలాంటి వారి స్థానంలో కొత్త వారిని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులుగా నియమిస్తోంది. ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగటం, పక్షపాతం వహించారనే మాట రాకుండా చూసేందుకే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆయా రాష్ట్రాల్లో మూడు, అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుండి ఒకే పదవిలో ఉన్న వారిని కూడా ఇతర పదవులలోకి బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలను ఆదేశించింది.