జాతీయ వార్తలు

ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా శుక్రవారం ఉదయం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 450 విమానాల సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈపరిస్థితి ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ కనిపించింది. విమానాలు ఆలస్యంగా రావడమో లేదా దారి మళ్లించడంతో జరిగిందని అధికారులు వెల్లడించారు. 10.30 వరకూ అదే పరిస్థితి కొనసాగడంతో ఆ తరువాత సర్వీసులను దారి మళ్లిండం లేదా రద్దుచేయడం జరిగింది. విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన, చేరుకోవల్సిన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం 5.30, 10.20 మధ్య ఐదు విమానాలను దారిమళ్లించారు. అందులో సింగపూర్ నుంచి రావల్సిన విమానం కోల్‌కతాకు మళ్లించినట్టు ఓ అధికారి వెల్లడించారు. బ్యాంకాక్, దుబాయి, గువహటీ, మస్కట్ నుంచి వచ్చిన నాలుగు విమానాలను జైపూర్ మళ్లించారు. ఇది ఉదయం 7.30, 10.20 గంటల మధ్యే చోటుచేసుకుంది. పరిమితమైన సర్వీసులను పరిస్థితులను బట్టి అంటే మంచుతగ్గడం, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) అనుమతుల ఆధారంగా బయలుదేరినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయం రన్‌వే కనిపించలేదు.
తెల్లవారుజామున 4 గంటలకు పరిస్థితి అత్యంత దారుణంగా ఉండింది. 9.20-10.20 మధ్య కాస్త పరిస్థితి మెరుగుపడింది. పొగమంచు కారణంగా విమాన సర్వీసుల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడిందని, నెట్‌వర్క్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని విస్టారా ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది. పరిస్థితి మెరుగయ్యాక విమానాలు బయలుదేరినట్టు సంస్థ స్పష్టం చేసింది. ఢిల్లీ, బెంగళూరులో పొగ మంచు కారణంగా తమ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందని జెట్ ఎయిర్‌వైస్ ప్రకటించింది.