జాతీయ వార్తలు

అది ప్రజా వ్యతిరేక కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిల్వాస్సా (దాద్రానగర్ హవేలి), జనవరి 19: కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మహాకూటమి ప్రజా వ్యతిరేకమైనదని, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నడుచుకునే వ్యక్తుల కూటమి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. ఈ కూటమికి ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు. వీరంతా దేశాన్ని దోచుకోవాలనుకునే ప్రయత్నాలను బీజేపీ నిరోధించిందన్నారు. శనివారం ఇక్కడ ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఒకే ఎమ్మెల్యే ఉన్నారని, కాని మమతా బెనర్జీ బీజేపీ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల మహాకూటమి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నడుచుకునే కూటమి అని, నరేంద్రమోదీ వ్యతిరేక కూటమి కాదని, ప్రజా వ్యతిరేక కూటమి అని ఆయన విమర్శల దాడిని పెంచారు. అవినీతిని సహించేదీ లేదని, కాని తాను తీసుకుంటున్న కఠిన చర్యలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచుకోవాలనే విపక్షాల కుయుక్తులను సాగనివ్వలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ రాష్ట్రంలో సభలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వని పార్టీలు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండడం దారుణమన్నారు. విపక్ష పార్టీలకు చిత్తశుద్ధిలేని, నిజాయితీ లోపించిందని, ప్రజల సంక్షేమం అక్కర్లేదన్నారు. అభివృద్ధిని చూసి భరించలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అధికారం కోసం తాపత్రయపడడం తప్ప విపక్ష పార్టీలకు స్పష్టమైన అజెండా లేదన్నారు. ప్రజాస్వామ్యం, అవినీతి నిర్మూలన అంటే వీరికి గిట్టదన్నారు. గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ విధానాలను చూసి ఓర్వలేక వీరు నిరాధారమైన ఆరోపణలతో బురదజల్లుతున్నారన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో వీరికి బుద్ధి చెబుతారన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను వివరించారు.
అంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లో రైసాన్ గ్రామంలో నివసిస్తున్న తన తల్లిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. మోదీ తల్లి హీర్బా చిన్న తమ్ముడు పంకజ్‌మోదీ ఇంట్లో ఉంటున్నారు. దాదాపు 30 నిమిషాల సేపు తల్లిని పలుకరించారు. ఇతర కుటుంబ సభ్యులను కూడా మోదీ కలుసుకున్నారు. అనంతరం అహ్మదాబాద్‌కు ప్రత్యేక విమానంలోబయలుదేరి వెళ్లారు.
చిత్రం..గుజరాత్‌లోని హజీరాలో శనివారం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎల్ అండ్ టీ సంస్థ రూపొందించిన హోవిడ్జర్ కె-9 వజ్ర యుద్ధ ట్యాంకులో ప్రధాని నరేంద్ర మోదీ