జాతీయ వార్తలు

ఉగ్రవాద అనుమానితుడు జకీర్ ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: వివాదస్పద ఇస్లామిక్ సంస్థల నేత జకీర్ నాయక్ చెందిన రూ.16.40 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. ముంబయి, పూణేలో నాయక్ కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బినామీ ఆస్తులను గుర్తించి జప్తుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ముంబయిలో ఫాతీమా హైట్స్, ఆఫియా హైట్స్‌లో, పూణేలో ఎంగ్రాసియాలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఈడీ పేర్కొంది. ఈ ఆస్తుల కొనుగోలుకు బ్యాంకు అకౌంట్ల ద్వారా నగదు మార్పిడి జరిగినట్లు ఈడీ పేర్కొంది. 2016 డిసెంబర్‌లో జకీర్ నాయక్‌పైన ఈడీ కేసు నమోదు చసేంది. నాయక్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఆఫ్ ఏజన్సీ దర్యాప్తు చేస్తోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై కేసులను నమోదు చేశారు. హిందువులు, క్రైస్తవులు, వాహాబీయేతర ముస్లింలు, షియాలు, సూఫీలు ఇతర విశ్వాసపరులను లక్ష్యంగా చేసుకుని జకీర్ నాయక్ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని ఎన్‌ఐఏ చార్జిషీటులో పేర్కొంది. ఇంతవరకు జకీర్ నాయక్‌కు చెందిన రూ.50.49 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ప్రస్తుతం జకీర్ మలేషియాలో అజ్ఞాతవాసంలో ఉన్నాడు.