జాతీయ వార్తలు

బీజేపీని ఓడించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 19: వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని బీజేపీ అసమ్మతివాదులు శత్రుఘ్నసిన్హా, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో శత్రుఘ్నసిన్హా ప్రస్తుత లోక్‌సభలో బీజేపీ ఎంపీగా ఉన్నారు. మిగిలిన ఇద్దరు నేతలు గతంలో వాజపేయి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన మహా కూటమి ర్యాలీలో ఈ ముగ్గురు బీజేపీ అసమ్మతి నేతలు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా మాట్లాడుతూ తనను పార్టీ నుంచి తొలగించినా భయపడే ప్రసక్తిలేదని, వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీని ఓడించి తీరాలన్నారు. మోదీ నియంతృత్వ పోకడల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవా పన్నును ప్రవేశపెట్టడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. యశ్వంత్ సిన్హా ఏర్పాటు చేసిన రాష్ట్ర మంచ్ అనే వేదిక తరఫున ఈ సభకు హాజరైనట్లు చెప్పారు. నిజాలను దాచిపెట్టే కొద్దీ చౌకీదార్‌ను దొంగలాగా చూస్తారన్నారు. వాజపేయి ప్రజాహితం కోసం పనిచేశారని, మోదీ నియంతృత్వంతో పాలనను అందిస్తున్నారన్నారు. కేంద్రమాజీ మంత్రి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గణాంక వివరాలతో లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించే తొలి ప్రభుత్వం నరేంద్రమోదీనేనన్నారు. మాజీ మంత్రి అరుణ్ శౌరీ కూడా మోదీ ప్రభుత్వతీరును దుయ్యబట్టారు.