జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 19: దేశంలో ప్రజాస్వామ్య విలువలను పునరుద్దరించుకొని రాజ్యాంగ వ్యవస్థలను రానున్న ఎన్నికల ఫలితాల ద్వారా పరిరక్షించుకుందామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ఈసారి జరిగే లోక్‌సభ ఎన్నికలు అసాధారణమైనవని, దురంహంకార, విచ్ఛిన్నకర నరేంద్రమోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ఉద్దేశించినవేనని అన్నారు. కోల్‌కతా ర్యాలీకి హాజరుకానప్పటికీ సోనియా, రాహుల్‌గాంధీలు విపక్షాల సంఘీభావానికి సంకేతంగా సందేశం పంపారు.
దేశాన్ని దగా చేసిన మోదీ: చంద్రబాబు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను దగా చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలో ఆయన ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ అమలుచేయలేదని ఆయన ఆరోపించారు. అవినీతి రహిత పాలన, విదేశీ బ్యాంకుల్లోని నల్లధనం వెనక్కి రప్పించడం, రైతుల ఆదాయం రెట్టింపుచెస్తామన్న హామీలు ఏమయ్యాయని బాబు నిలదీశారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ కాదు.. పబ్లిసిటీ మినిస్టర్. ఆయన పెర్‌ఫార్మెన్స్ మినిస్టర్ కాదు’ అంటూ బాబు నిప్పులు చెరిగారు. దేశంలోని రైతులను మోదీ మోసం చేశారని ఆయన విమర్శించారు. మోదీ పాలనలో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. ‘రైతుల ఆదాయం రెట్టింపుహామీ స్థానే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి’అని ఏపీసీఎం ధ్వజమెత్తారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం చోటుచేసుకుందని ఆయన అన్నారు. అలాగే పెద్దనోట్ల రద్దు దేశ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఉద్యోగాల కల్పన లేకపోవడంతో దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందని ఆయన తెలిపారు.
ఈవీఎంలుకాదు ఛోర్ మెషీన్లు: ఫరూక్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) ఛోర్ మెషీన్లుగా తయారయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ సారధ్యంలో శనివారం ఇక్కడ జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈవీఎంలకు స్వస్తిచెప్పి బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎందరో మహానుభావుల త్యాగాలతో వచ్చిన దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవల్సిన తరుణం వచ్చిందని ఫరూక్ అన్నారు. నిజం చెప్పాలంటే ఈవీఎంలు ఛోర్ మెషీన్లుగా మారిపోయాయని ఆయన తెలిపారు. తక్షణం వాటికి స్వస్తిచెప్పాలని, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను వాడడం లేదని ఫరూక్ స్పష్టం చేశారు. ‘మనందరం ఎన్నికల కమిషన్, రాష్టప్రతిని కలిసి ఈవీఎంల గురించి చెబుదాం. బ్యాలెట్ పేపర్లతోనే పారదర్శకత ఉంటుందని వారి దృష్టికి తీసుకెళ్దాం’అని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నిర్వాకం వల్లే జమ్మూకాశ్మీర్ తగలబడిపోతోందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మతాల పేరుతో విడిపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.‘నేను ముస్లింనే. భారత్‌ను నేను ప్రేమిస్తాను. ఈదేశాన్ని నాదిగా భావిస్తాను’అని ఆయన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.
ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్భ్రావృద్ధి: కుమారస్వామి
కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. స్థానిక అవసరాలు తీర్చడం, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని శనివారం ఇక్కడ టీఎంసీ ర్యాలీలో స్పష్టం చేశారు. ప్రపంచంలోనే పటిష్టమైన ప్రజాస్యామ్య వ్యవస్థ భారత్‌లో ఉందని ఆయన ఉద్ఘాటించారు. అయితే నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోందని స్వామి ధ్వజమెత్తారు. ‘ప్రజాస్వామ్య విలువలను ఎలా మంటగలిసి పోతున్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక పాలనలో ప్రజలు అనేక అగచాట్లకు గురవుతున్నారు’అని కర్నాటక సీఎం విమర్శించారు. రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాంతీయ పార్టీలే కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు. ‘తమిళనాడు ప్రయోజనాల కోసం డీఎంకే అధినేత దివంగత కరుణానిధి ఎంతో పోరాడారు. యూపీలో ఎస్పీ,బీఎస్పీ ఎంతో సమర్ధవంతగా పనిచేస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్నారు’అని కుమారస్వామి కితాబిచ్చారు. దేశంలో మహిళలకు తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఓ రోల్‌మోడల్ అంటూ జేడీఎస్ నేత ప్రశంసించారు. మహిళల సాధికారిత కోసం పశ్చిమ బెంగాల్ సీఎం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
యూపీలో బీజేపీకి ఒక్క సీటూ రానీయం: అఖిలేష్
యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమితో కేంద్రంలోని బీజేపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీలో బీజేపీకి ఒక్క సీటు దక్కకుండా కట్టడి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే బీజేపీ పీడ విరడవుతుందని ఆయన అన్నారు. బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ప్రతిపక్షాల ర్యాలీలో అఖిలేష్ ప్రసంగిస్తూ ‘ప్రధాని మంత్రి అభ్యర్థి ఎవరంటూ బీజేపీ అడుగుతున్న ప్రశ్నకు మనం గట్టిగానే సమాధానం చెబుదాం’అని ప్రతిపక్ష నేతలకు చెప్పారు. ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారన్న విషయం బీజేపీ నేతలకు అర్థమయ్యేలా చెబుదామని ఆయన చలోక్తి విసిరారు. దీనిపై మోదీకి అంత ఆతృత ఎందుకని అఖిలేష్ నిలదీశారు. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడితే వారిపై ఈడీ, సీబీఐను ఎగదోస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి తరఫు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ర్యాలీలో ప్రసంగించారు. ఆర్‌ఎల్‌డీ చీఫ్ అజిత్ సింగ్ తరఫున ఆయన కుమారుడు జయంత్ చౌదరి హాజరయ్యారు. దేశ ప్రజలందరూ కొత్త సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకొన్నారని, ఈ ఏడాది కొత్త ప్రధానిని చూస్తామన్న ధీమాతో వారున్నారని అఖిలేష్ స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సరైన గుణపాఠం చెప్పాలని, దీనికి ప్రతిపక్షాలు కార్యోన్ముఖులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్రంలో బీజేపీని మట్టికరిపించాలి: దేవెగౌడ
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. విభేదాలు పక్కనబెట్టి ప్రతిపక్షాలు ఏకంకావాలని ఆయన అన్నారు. శనివారం ఇక్కడ పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్యర్యంలో జరిగిన మహార్యాలీలో దేవెగౌడ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీని గద్దెదిండచడానికి ఓ రోడ్‌మ్యాప్ రూపొదించుకోవల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘ప్రతిపక్షాలన్నీ ఓకే వేదికపైకి రావాలి. బీజేపీని ప్రత్యక్షంగా ఎదుర్కోవాలి’అని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని జేడీఎస్ చీఫ్ అన్నారు.‘మోదీ ప్రభుత్వం దేశంలో లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తోంది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తోంది’అని ఆయన దుయ్యబట్టారు. ప్రధానిగా ఎవరుండాలన్న అంశాన్ని పక్కనబెట్టి దేశానికి సుస్థిర ప్రభుత్వం ఇవ్వడంపైనే ప్రతిపక్షాలు దృష్టిసారించాలని ప్రతిపక్షాలకు దేవెగౌడ పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదించడమే ప్రధాన అజెండాగా ప్రతిపక్షాలు పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1996-97లో తాను ప్రధానిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వం అస్సాంలో బోగీబీల్ వంతెనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, అలాగే ఢిల్లీ మెట్రోకూ తమ ప్రభుత్వపై ఆమోదం తెలిపిందని మాజీ ప్రధాని గుర్తుచేశారు. సంకీర్ణ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి, జాతీయవాదం బలపడతాయని ఆయన ఉద్ఘాటించారు.

చిత్రం..కోల్‌కతా ర్యాలీలో పాల్గొన్న విపక్షాల నేతలు అఖిలేష్ యాదవ్, కుమారస్వామి, చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా