జాతీయ వార్తలు

మిలియన్ సమస్యలకు బిలియన్ పరిష్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఏ సమస్యనైనా సరైన ఆలోచన, దృక్పథంతో పరిష్కరించవచ్చునని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. దేశంలో లక్ష సమస్యలుంటే వాటిని అధిగమించేందుకు కోటి పరిష్కారాలుంటాయని శనివారం నాడు ఇక్కడ భారతీయ సినిమా జాతీయ మ్యూజియంను ప్రారంభించిన సందర్భంగా అన్నారు. ఇట సమాజం.. అటు సినిమాలు పరస్పరం ప్రతిబింబించేవేనని పేర్కొన్న ఆయన ‘‘సినిమా మాదిరిగానే కాలానుగుణంగా దేశంలోనూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. మార్పుల ఫలితంగా తలెత్తే సమస్యలన్నింటికీ ఎప్పటికప్పుడు పరిష్కారాలు కనుగొంటూ భారతదేశం ముందుకు దూసుకు పోతుందని అన్నారు. ‘‘ఓ మిలియన్ సమస్యలుంటే వాటికి ఓ బిలియన్ పరిష్కారాలుంటాయి’’ అని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు. దేశ సామాజిక జీవనంలో సినిమా అత్యంత కీలకమైన భూమికను పోషిస్తోందనీ, గుణాత్మక రీతిలో సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తుందని అన్నారు. భారతీయ సినిమాలకు ఇతర దేశాల్లో ఎంత ప్రాచుర్యం ఉందో తాను విదేశీ పర్యటనల్లో స్వయంగా తెలుసుకున్నాను అని తెలిపారు. విదేశీ నేతలను తాను కలిసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు భారతీయ సినిమా ప్రస్తావన రావడం తనకెంతో ఆనందాన్ని కలిగించేదని ఈ సందర్భంగా తెలిపారు. పైరసీ సహా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సినిమా షూటింగ్‌లు, సంబంధిత ఇతర అంశాలకు సంబంధించి అనుమతుల విషయంలో సింగిల్ విండో విధానాన్ని అమలులోకి తెస్తామని తెలిపారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం శిఖరాగ్ర సదస్సు మాదిరిగానే భారత్‌లో కూడా గ్లోబల్ ఫిలిం సమ్మెట్‌ను నిర్వహిస్తామన్నారు. దేశంలో పర్యాటక రంగ అభివృద్ధిలో సినిమాలు అత్యంత కీలకమని పేర్కొన్న మోదీ దేశంలో టూరిజం అంతగా అభివృద్ధి చెందితే అంతగానూ ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తుందని తెలిపారు.
చిత్రాలు.. నేషనల్ మ్యూజియంలోని పిల్లల విభాగాన్ని సందర్శిస్తున్న ప్రధాని మోదీ..
*మహాత్మాగాంధీ విగ్రహం పక్కన కూర్చున్న దృశ్యం.