జాతీయ వార్తలు

శశికళకు జైల్లో వీఐపీ సదుపాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 20: కర్నాటక జైల్లో ఒక కేసులో శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు సమాచార హక్కు సామాజిక కార్యకర్త నరసింహ మూర్తి తెలిపారు. ఆమెకు వీఐపీ సదుపాయాలు లభిస్తున్నాయి. ఐదుగదులు శశికళకు కేటాయించారు. ప్రైవేట్ కుక్ కూడా ఉన్నారు. విజిటర్స్ ఎప్పుడైన శశికళను కలుసుకునే ఏర్పాట్లు ఉన్నాయి. 59 ఏళ్ల శశికళ అవినీతి కేసులో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. పారప్పన అగ్రహార జైల్లో శశికళకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. జైలు అధికారులు అన్ని రకాల నిబంధనలకు తిలోదకాలిచ్చారన్నారు. నాలుగు గదుల్లో ఉన్న మహిళా ఖైదీలను ఇతర గదుల్లో సర్ది, మొత్తం ఐదుగదులను శశికళకు కేటాయించారు. 2017 ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆమె జైల్లో ఉంటున్నారు.