జాతీయ వార్తలు

మోదీకి ప్రత్యామ్నాయ నేత లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, జనవరి 20: దేశంలో ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం లేదని, ఆయన లేకపోతే అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం కోల్‌కతాలో జరిగిన విపక్షాల ర్యాలీ గురించి ఆయన ప్రస్తావిస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు బలహీనమైన ప్రభుత్వానే్న కోరుకుంటున్నారే తప్ప బలహీన ప్రభుత్వాన్ని కాదని అన్నారు. శనివారం జరిగిన ర్యాలీలో పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారని, వారి ప్రధాన లక్ష్యం మోదీని గద్దెదించడమని, కాని వారిలో ఆయనకు ప్రత్యామ్నాయ నేత ఒక్కరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టి మోదీ లేకపోతే ఆయన స్థానాన్ని భర్తీ చేసేవారెవరూ లేరని అర్థమవుతోందని, ఆయన స్థానంలో మరెవరు వచ్చినా దేశంలో అస్థిరత, అస్తవ్యస్త పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. గతంలో ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, హెచ్‌డే దేవెగౌడ వంటి బలహీనమైన ప్రధానుల పాలనలో దేశంలో నెలకొన్న అస్థిరపరిస్థితులను ఆయన గుర్తు చేస్తూ, వారి పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. పటిష్టవంతమైన పాలనలో ఉన్న మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు కళ్లారా చూస్తున్నారని, ఇప్పుడు వారు బలమైన, బలహీన ప్రభుత్వ పాలనల మధ్య తేడాలను గుర్తించారని అన్నారు. కోల్‌కతా ర్యాలీతో విపక్షాల బలహీనత మరోసారి బయటపడిందని, ఇంతా చేసి వారు మేనిఫెస్టోను తయారు చేయడానికి ఒక కామన్ కమిటీని కాని, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌ను కాని ఏర్పాటు చేయలేకపోయినా, ఈవీఎంల మీద విమర్శలు చేయడానికి మాత్రం అందరూ ఒక్కటయ్యారని విమర్శించారు. అవినీతికి పాల్పడని వారిని, అవినీతి లేని వ్యవస్థ ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా తమకు ఓటు బ్యాంకు పెరిగినందున 2014 లోక్‌సభ ఎన్నికల కంటే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో సాధించిన 282 సీట్ల సంఖ్యను తాము కచ్చితంగా దాటుతామని, ముఖ్యంగా తమకు ఒడిసా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మునుపటి కంటే అధికంగా సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. ‘మేరా ఘర్- బీజీపీ కా ఘర్’ నినాదంతో తాము పలు శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రజల మధ్యలోకి దూసుకుపోతున్నామని ఆయన చెప్పారు.
చిత్రం..పుణెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జావడేకర్