జాతీయ వార్తలు

ఆతిథ్య వాసి.. కాశీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: భారతీయ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి ‘అతిథి దేవోభవ’ అన్న నానుడికి అద్దం పట్టేలా ముస్తాబవుతోంది. కుంభమేళా సందర్భంగా వేలాదిమందికి ఆతిథ్యాన్నిస్తున్న ఈ ఆధ్యాత్మిక నగరం ప్రవాసీ దినోత్సవానికి రెండింతలుగా సన్నద్ధమవుతోంది. ఆత్మీయత, ఆప్యాయత, ఆదరణ గీటురాళ్లుగా అతిథులను అక్కున చేర్చుకునేందుకు సన్నద్ధం అవుతోంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ప్రవాసీ దినోత్సవం కోసం కాశీ పుణ్యక్షేత్రం మరింతగా తన అతిథ్య సంస్కృతిని చాటుకోనుంది.
ప్రవాసి దివస్‌కు వచ్చేవారికి ఆతిథ్యమిచ్చేందుకు వారణాసిలోని దాదాపు వంద కుటుంబాలను ఎంపిక చేశారు. వీరంతా తమ ఇంట్లోనే ఆతిథ్యమిచ్చి తమ సాంప్రదాయాలు తెలియజేయడంతోపాటు వారే స్వయంగా ఆహారాన్ని వండి వడ్డిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ‘కాశి ఆతిథ్యం’ పేరుతో అతిథులకు చిరస్మరణీయంగా గుర్తుండేలా ఏర్పాట్లు జరిగాయి. అలాగే నగరంలోని అన్ని హోటళ్లను సుందరంగా తీర్చిదిద్దారు. ‘అతిథి దేవోభవ’ అనే నానుడికి వాస్తవరూపం కల్పించే విధంగా ఆయా కుటుంబాల వారు ఉచితంగా ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అలాగే ఆతిథ్యమిచ్చే ఇళ్లకు అతిథులను చేరవేసేందుకు అధికారులు వాహనాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా, జనవరి 26న రిపబ్లిక్ డే ఉత్సవాలు కూడా జరగనుండడం ప్రస్తుత ప్రవాసీ దివస్‌కు మరింత ఆకర్షణగా మారింది. అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మూడు రోజులు నిర్వహించనున్న ప్రవాసీ దివస్‌కు హాజరయ్యేందుకు ఇప్పటికై 5,802 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రవాసీ దివస్ 23న ముగుస్తుంది. అనంతరం 24న వీరంతా కుంభమేళాలో పాల్గొనేందుకు స్విస్ కాటేజ్‌లో ఆతిథ్యమిస్తారు. అనంతరం వీరికి ఢిల్లీలో బస ఏర్పాటు చేస్తారు. 25 ఢిల్లీ పరిసరాలు సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవాల్లో పాల్గొంటారు. ప్రవాసి దివస్‌ను 22న ప్రధాని నరేంద్ర మోదీ లాంచనంగా ప్రారంభిస్తారు. 23న ముగింపు సమావేశంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొంటారు.