జాతీయ వార్తలు

జడ్జీల నియామకంలో రిజర్వేషన్ల ప్రతిపాదన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఉన్నత న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణ ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 124, 217 ఆర్టికల్స్‌కు లోబడే సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని పలు సంఘాలు కోరుతున్నట్టు చెప్పారు. ‘ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి. రాజ్యాంగ సవరణ చేయాలని ఆయా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి’ అని సభలో ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 124, 217కు లోబడే సుప్రీం కోర్టు, హైకోర్లుల్లో జడ్జిల నియామకం జరుగుతుందని, ఇందులో ఎలాంటి రిజర్వేషన్ల అమలుకు ఆస్కారం లేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.