జాతీయ వార్తలు

స్వచ్ఛదూతల సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జనవరి 22: పవిత్ర గంగానదికి జరుగుతున్న అర్థ కుంభమేళాకు ప్రతిరోజూ లక్షలాది మంది తరలి రావడంతో ప్రధానమైన పారిశుద్ధ్య సమస్య ఏర్పడకుండా స్వచ్ఛతా దూతలు విశేష సేవలందిస్తున్నారు. రాత్రి పగలు లేకుండా 24 గంటలూ వీరందిస్తున్న సేవలు యాత్రికుల ప్రశంసలు అందుకుంటున్నాయి. రోజుకు 8 గంటలు పనిచేయాల్సిన వీరు 10 గంటలు, 12 గంటలూ కూడా విధుల్లో నిమగ్నమవుతూ పనికే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొంటున్నారు. కుంభమేళా సందర్భంగా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. కుంభమేళా జరిగే ప్రాంతాన్ని బహిరంగ విసర్జన రహిత ప్రాంతంగా ఉంచే ఉద్దేశంతో లక్ష మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. సాలిడ్ వేస్టును సేకరించడానికి 20 వేల డస్ట్‌బిన్లు, చెత్తను సేకరించడానికి 120 టిప్పర్లు, 40 ట్రాక్టర్లు, 15వేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. వీరి సేవలకు తోడు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వచ్ఛ దూతలు వేలాదిగా వచ్చి పరిసరాలను శుభ్రపర్చడంలో పాలుపంచుకుంటున్నారు. ముఖ్యంగా రెండు వేలమంది గంగా ప్రహరీలు ఎక్కడ ఏ చిన్న చెత్తపడినా నిముషాల్లో దానిని శుభ్రం చేస్తున్నారు. కుంభమేళా సందర్భంగా అమర్చిన సీసీ టీవీల వల్ల ఎక్కడ అపరిశుభ్రంగా ఉందో తమకు వెంటనే తెలిసిపోవడంతో అక్కడకు చేరుకుని శుభ్రం చేస్తున్నామని వారు తెలియజేస్తున్నారు. పవిత్ర దినాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి లక్షల్లో, ఒక్కో దినం కోటిమంది కూడా వస్తున్నారని, అయినా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం కృషి చేస్తున్నామని వారు చెప్పారు.