జాతీయ వార్తలు

10 లక్షల మందికి 18 మందే జడ్జీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: దేశంలో పది లక్షల మంది జనాభాకు 18 మంది న్యాయమూర్తులున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1987 నివేదిక ప్రకారం 10 లక్షల మందికి 50 మంది జడ్జీలుండాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. అయితే ఇప్పటికీ న్యాయమూర్తులు సంఖ్య పెరగలేదు. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం వివిధ రాష్ట్రాల జనాభా, న్యాయమూర్తుల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం మొత్తాన్ని చూస్తే పది లక్షల మంది జనాభాకు 17.86 మంది జడ్జిలున్నారు. మిజోరంలో ఈ నిష్పత్తి 57.74, ఢిల్లీలో 47.33, అత్యధిక జనాభాగల యూపీలో 10.54 మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అత్యల్పంగా అంటే పది లక్షల మందికి 10.45 నిష్పత్తిలో న్యాయమూర్తుల సేవలందుతున్నాయి. హైకోర్టుల మాట అటుంచి సర్వోన్నత న్యాయస్థానంలోనే ముగ్గురు న్యాయమూర్తుల అవసరం ఉంది. ఇటీవలే నలుగురు జడ్జీలను నియమించినా మూడు ఖాళీగా ఉన్నాయి. దేశంలోని 24 హైకోర్టుల్లో జూలై నెలాఖరునాటికి 477 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.