జాతీయ వార్తలు

నేడే నింగిలోకి పీఎల్‌ఎల్‌వీ-సీ 44 రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: మరో వినూత్న ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి గురువారం అర్ధరాత్రి 11:37 గంటలకు పీఎస్‌ఎల్‌లీ-సీ 44 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) డాక్టర్ సురేష్ అధ్యక్షతన షార్‌లో బుధవారం జరిగింది. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్ ఆధ్వర్యంలో లాంచింగ్ అథరైజేషన్ బోర్డు వారు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్తవ్రేత్తలు ప్రీ కౌంటౌడౌన్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను బుధవారం రాత్రి సరిగ్గా 7:37 గంటలకు ప్రారంభించారు. కౌంట్‌డౌన్ 28 గంటలు నిర్విఘ్నంగా కొనసాగినంతం పీఎస్‌ఎల్‌వీ-సీ 44 రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా తమిళనాడు హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన కలాం శాట్, ఇస్రో రూపొందించిన మైక్రోశాట్-ఆర్ రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఎప్పుడూ ఏదోఒక కొత్తదనంతో ప్రయోగాలు చేపట్టే ఇస్రో ఈ ప్రయోగానికి రెండు స్ట్రాపాన్ బూస్టర్లతోనే రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు శ్రీకారం చుట్టింది. ఈ తరహా ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ-డీఎల్ అని పేరుతో ఈ రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. షార్ నుంచి 70వ ప్రయోగం కాగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో 46వ ప్రయోగం కావడం విశేషం.