జాతీయ వార్తలు

ఏపీకి ‘హోదా’ ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలన్న తమ డిమాండ్‌కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించనందుకు నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో వాకౌట్ చేశారు. ఎస్‌వి సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, అవినాష్ రెడ్డి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పోడియం వద్ద నిలబడి ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ గొడవ చేశారు. పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఏపీకి న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలిచ్చారు. నినాదాలు ఇవ్వటం మంచిది కాదు, మీ సీట్లలోకి వెళ్లండంటూ స్పీకర్ సుమిత్రా మాహజన్ పలుమార్లు సూచించినా వారు పట్టించుకోలేదు. అయితే ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన అనంతరం వారు తమ సీట్లలోకి వెళ్లిపోయారు. సుమిత్రా మహాజన్ జీరో అవర్‌లో వైకాపా సభ్యుడు సుబ్బారెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాజీ ప్రధాన మంత్రి పార్లమెంటులో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఎంతో అవసరమని సుబ్బారెడ్డి అన్నారు. తమ డిమాండ్‌కు ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఇప్పుడే తమకు సమాధానం ఇవ్వాలని ముగ్గురు సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవటంతో వారు వాకౌట్ చేశారు.

చిత్రం.. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీలు