జాతీయ వార్తలు

కేజ్రీ సర్కార్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పోలీసు వ్యవస్థపై లెఫ్టినెంట్ గవర్నర్ పెత్తనంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి భంగపడింది. దేశ రాజధానిలో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను తగ్గించలేనని కోర్టు తేల్చిచెప్పింది. దేశం నలుమూలల నుంచి ఎందరో ప్రముఖులు, వివిఐలు రాజధానికి వస్తుంటారని, కాబట్టి శాంతిభద్రతల అంశం కేంద్రం అజమాయిషీ కింద ఉంటేనే మంచిదని కోర్టు పేర్కొంది. ప్రజల నుంచి ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ముఖ్యంగా శాంతిభద్రతల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదని కేజ్రీవాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండే మంత్రివర్గం సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆప్ సర్కార్ కోరింది. కాగా అధికారాలకు సంబంధించి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య వైరం కొనసాగుతున్న నేపథ్యంలో గురువారంనాటి హైకోర్టు తీర్పు కేజ్రీవాల్ సర్కార్‌కు చెంపపెట్టువంటిదే. ఆర్టికల్ 239 కింద దేశ రాజధాని ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తింపు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎసిబి చర్యలు కూడదని కోర్టు తీర్పునిచ్చింది. ఇలాఉండగా హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది.

చిత్రం.. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్