జాతీయ వార్తలు

‘బ్లాక్ అవుట్’ మాట అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతున్న సార్క్ దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో గురువారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగాన్ని మొత్తం మీడియా బహిష్కరించిందంటూ (బ్లాక్ అవుట్) వచ్చిన వార్తలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఇస్లామాబాద్‌లో ఈ రోజు సార్క్ దేశాల హోమ్ మంత్రుల సమావేశానికి సంబంధించి మన హోం మంత్రి ప్రకటనను మీడియా బహిష్కరించిందంటూ వచ్చిన వార్తలు అబద్ధం, అవి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చే దేశం ప్రారంభోపన్యాసం బహిరంగంగా ఉండడం, మీడియాను అనుమతించడం, మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆంతరంగికంగా ఉండాలనేది సార్క్ మొదటినుంచీ పాటిస్తూ వస్తున్న సంప్రదాయం అని, దీనివల్ల అంశాలపై చర్చలు నిర్మొగమాటంగా, నిజాయితీగా జరగడానికి వీలవుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశానికి మీడియా సంస్థలను అనుమతించకపోవడం కారణంగా రాజ్‌నాథ్ ప్రకటనను మీడియా పూర్తిగా మరుగుపరిచిందంటూ వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. సమావేశం జరిగే వేదిక లోపలికి ప్రభుత్వ అధీనంలోని పాక్ టెలివిజన్‌ను మాత్రమే అనుమతించినట్లు కూడా ఆ వార్తలు పేర్కొన్నాయి.
ఖాన్ విందుకు రాజ్‌నాథ్ గైరుహాజరు
ఇస్లామాబాద్: సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశానికి హాజరయిన ప్రముఖులకు పాక్ విదేశాంగ మంత్రి చౌదరి నిసార్ ఖాన్ గురువారం ఇచ్చిన విందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గైరుహాజరయ్యారు. ప్రధాన సమావేశం తర్వాత ఖాన్ ఈ విందు ఇచ్చారు. విందు తానే ఇస్తున్నప్పటికీ ఆయన సమావేశం ముగిసిన వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయారు. దీన్ని అవకాశంగా తీసుకున్న రాజ్‌నాథ్ విందుకు వెళ్లకుండానే హోటల్‌కు వెళ్లిపోయారు. హోటల్ గదిలో ఢిల్లీనుంచి తన వెంట వచ్చినవారితో కలిసి భోజనం చేశాక ఢిల్లీకి తిరుగుప్రయాణమయ్యారు.

చిత్రం.. భారత ప్రతినిధులతో కలిసి సార్క్ దేశాల హోమ్ మంత్రులతో భేటీలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్