జాతీయ వార్తలు

జిఎస్‌టికి సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) చట్టాన్ని అమలులోకి తెస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఖచ్చితంగా చెప్పిన నేపథ్యంలో అందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మరో పక్క ఈ బిల్లును ఆమోదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. బిల్లు ఆమోదానికి అవసరమైతే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తామని నితీష్ అన్నారు. కాగా అసలు జిఎస్‌టి అన్నది యుపిఏ ఆలోచనేనని ఆ బిల్లును అమలుచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిద్దరామయ్య తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన 60వేలమంది రెవెన్యూ సిబ్బందికి ఈ కొత్త చట్టం అమలు ప్రక్రియలో శిక్షణ ఇవ్వాలని ఎన్‌డిఏ సర్కార్ సంకల్పిస్తోంది. ముఖ్యంగా జిఎస్‌టి చట్టాలు, వాటి ఉద్దేశాలు, అందులోని నిబంధనల అర్థ తాత్పర్యాలపై ఈ అధికారులకు కూలంకషంగా అవగాహన కలిగించే రీతిలో శిక్షణ ఇస్తారు. అదేవిధంగా వచ్చే ఏడాది నుంచే దీన్ని అమలుచేయడానికి వీలుగా సమాచార టెక్నాలజీకి సంబంధించిన ఫ్రేంవర్క్‌ను కూడా రూపొందిస్తున్నారు. త్వరలోనే విస్తృత స్థాయిలో అన్ని పరిశ్రమలకు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించబోతున్నారు. ఈ రోడ్‌మ్యాప్‌ను రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ అధియా రూపొందించారు. వచ్చే ఏడాది మార్చి నాటికే అమలు ప్రక్రియ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికే జిఎస్‌టి చట్టాలకు సంబంధించిన శిక్షణ పూర్తవుతుందని, అనంతరం ఐటికి సంబంధించిన అంశాలపై కూడా శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకు వీలుగా జిఎస్‌టిఎన్ పేర కంపెనీని ఏర్పాటుచేశారు. ఇందులో భాగస్వామ్యం కలిగిన కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగానే ఐటి ఫ్రేంవర్క్‌ను రూపొందించుకుంటాయి. ఇప్పటికే రెవెన్యూ విభాగం ఇటు హైదరాబాద్‌లోనూ, జైపూర్‌లోనూ సంప్రదింపులను మొదలుపెట్టింది. కాగా, జిఎస్‌టి పన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ 18 నుంచి 20 శాతానికి మించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ చట్టం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అన్ని అంశాలనూ కేంద్ర, రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకుని పన్ను రేటును నిర్ణయిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.