జాతీయ వార్తలు

వంతెన ప్రమాదంపై జుడీషియల్ విచారణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహద్, ఆగస్టు 4: ముంబయి-గోవా రహదారిపై వంతెన కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్ విచారణకు ఆదేశించింది. బ్రిటీష్ కాలంనాటి వంతెన కొట్టుకుపోయి 22 మంది మృతిచెందారు. రెండు ప్రయాణికుల బస్సులు వరద నీట్లో కొట్టుకుపోయాయి. రాజధాని ముంబయికి 170 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సావిత్రి నదిపై ఉన్న పురాతన వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. సుమారు 40 గంటలపాటు ముమ్మర గాలింపు తరువాత 5 మృతదేహాలు లభించాయి. మగ్గురు పురుషులు, ఇద్దరు మహిళ మృతదేహాలు లభించాయని రాయ్‌గఢ్ అడిషనల్ ఎస్‌పి సంజయ్ పాటిల్ వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినట్టు గురువారం ఆయన తెలిపారు. సంఘటనా స్థలంలో 20 పడవలతో 160 మంది కోస్ట్‌గార్డ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, నావీ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నట్టు ఆయన చెప్పారు. రెండు బస్సులే కాకుండా పలు వాహనాలు వరద నీట్లో కొట్టుకుపోయి ఉంటాయని ఆందోళన చెందుతున్నారు. స్థానిక జాలర్ల సహకారంతో గాలిస్తున్నారు. బాధితులకు సమాచారం అందించేందుకు స్థానిక అధికారులు ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి దేవెందర్ ఫడ్నవీస్ జుడీషిల్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శాసన సభలో ఆయనొక ప్రకటన చేశారు. ప్రమాదం పట్ల సభ ఆందోళన వ్యక్తం చేసింది.

చిత్రాలు.. వరద ఉధృతికి గురువారంనాడు మరింత కొట్టుకుపోయన ముంబయి-గోవా రహదారి వంతెన

వరద నీట్లో కొట్టుకుపోయనవారికోసం సావిత్రి నదిలో గాలిస్తున్న నేవీ సిబ్బంది