జాతీయ వార్తలు

ఇరిగేషన్‌కు ఇస్రో సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ జల వనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, ఇస్రోకు మధ్య అవగాహనా ఒప్పందం రేపు కుదురనుంది. ఆరవ తేదీన ఉదయం 8.30కి మంత్రి హరీశ్‌రావు, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్‌ల సమక్షంలో ఎంఓయు కుదురుతుంది. జలవనరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసి ఉపగ్రహ చిత్రాలతో నీటి నిల్వలు, ఇతర అంశాలను విశే్లషించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుందని ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ పిజి దివాకర్ ప్రకటించారు. ఇకపై తెలంగాణలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, ఇతర జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉపగ్రహంతో సమీక్షించి విశే్లషించే విధానం అమల్లోకి రానున్నది.