జాతీయ వార్తలు

హైకోర్టు విభజనకు ప్రత్యేక కమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: అత్యంత వివాదాస్పదంగా మారిన రాష్ట్ర హైకోర్టు విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందా? చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఠాకూర్‌ను కలిసి కృష్టా పుష్కరాల ఆహ్వానం అందజేసినప్పుడు హైకోర్టు విభజన అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును వీలున్నత త్వరగా విభజించాలని చేస్తున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కమిటీ ఏర్పాటు ప్రతిపాదన వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఏపీ హైకోర్టును కొత్త రాజధానిలోనే ఏర్పాటు చేయాలని చంద్ర బాబు సూచించారని అంటున్నారు. రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కానందున ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించడం ఎలా సాధ్యమవుతుందని చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వచ్చే వారంలో ప్రారంభమవుతున్న కృష్ణా పుష్కారాలకు రావాల్సిందిగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని చంద్రబాబు ఆహ్వానించారు. పుష్కరాల మహత్యం తదితర అంశాలను రాష్టప్రతికి వివరించారు. అంతకుముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకుర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రమణ, కెహర్‌లతోపాటు మానవ హక్కుల సం ఘం అధ్యక్షుడు హెచ్.ఎల్.దత్తు లను కూడా పుష్కరాలకు ఆహ్వానించారు.

చిత్రం.. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు