జాతీయ వార్తలు

మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధాని దూరంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వౌలానా అబుల్‌కలాం అజాద్ సుజల స్రవంతి స్కీం పేరు మార్చి మిషన్ భగీరథ పేరును పెట్టారని, ఈ స్కీంను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దూరంగా ఉండాలని టిపిసిసి సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, టి జగ్గారెడ్డి, మల్లు రవి ప్రధానిని కోరారు. మిషన్ భగీరథకు కాకుండా వేరే కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరు కావాలని వారు కోరారు. ఈ నెల 7న అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథను ప్రధాని ప్రారంభిస్తారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో వౌలానా కలాం పేరిట ఒక పథకాన్ని ప్రారంభించిందన్నారు.
గోదావరి నుంచి 30 టిఎంసి జలాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ఈ స్కీంను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. పాత స్కీం పేరును మార్చి కొత్త పేరు పెట్టి దానిని ప్రధాని చేత ప్రారంభించే విధంగా చేయడం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగదన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్‌కు గోదావరి నీటిని ఇవ్వడానికి తమ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఏపి పునర్విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను వెంటనే అమలు చేయాలన్నారు.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హైకోర్టు విభజన, తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు, స్టీల్ ఫ్యాక్టరీ, ఉద్యానవన, గిరిజన వర్శిటీలను వెంటనే నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చడం తగదన్నారు. ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టిందన్నారు.
కెసిఆర్ రాజీనామా చేయాలి
హైకోర్టు జీవో 123ని రద్దు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పదవికి రాజీనామా చేయాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. రైతులు, రైతు కూలీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ జీవోను హైకోర్టు రద్దు చేయడాన్ని ఆయన స్వాగతించారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు.