జాతీయ వార్తలు

వాయుసేన విమానం కోసం ఏజెన్సీలో గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, ఆగస్టు 4: గల్లంతైన వాయుసేవ విమానం కోసం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో గురువారం కూడా హెలీకాప్టర్ల సహాయంతో గాలింపు చేపట్టారు. గత నెల 22న చెన్నై నుండి ఎఎన్ 32 అనే విమానం గల్లంతైన విషయం విదితమే. దాని జాడ నేటివరకు తెలియకపోవడంతో పలుమార్లు వాయుసేన, నేవీ అధికారులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లా సరిహద్దున ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ విమానం కూలినట్టు అధికారులు భావించడంతో పలుమార్లు గాలింపు చేపడుతున్నారు. కూలిన విమానంలో ఉన్న ఒక అధికారి సెల్‌ఫోన్ నుండి నాలుగు రోజుల పాటు సంకేతాలందడం, కూలే ముందు విమానాన్ని పలువురు చూసినట్టు చెప్పడంతో ఈ ప్రాంతంపై దృష్టి మరల్చారు. మారుమూలన ఉన్న ఈ ప్రాంతానికి హెలీకాప్టర్లు చేరకపోడంతో పోలీసుల సహాయాన్ని నేవీ అధికారులు కోరారు. ప్రస్తుతం మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లడానికి పోలీసులు ఇష్టపడడం లేదు. నేవీ హెలీకాప్టర్లు మండలంలో శరభవరం, కొండపల్లి, చినరెల్లంగి, బడదనాంపల్లి అటవీ ప్రాంతాలతో పాటు ఓగిపాలెం, లోదొడ్డి, అప్పలరాజుపేట, రాజవొమ్మంగి తదతర గ్రామాల్లో గాలింపు చేపట్టాయి.