జాతీయ వార్తలు

కెవిపి బిల్లుపై నేడు ఓటింగ్ ఉండదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో ఓటింగ్ జరగకుండా చూసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. సవరణ బిల్లు మనీ బిల్ కావటం వలన దీనిపై రాజ్యసభలో చర్చ జరిపేందుకు వీలు లేదని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ గత వారం చెప్పటం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్న సవరణ బిల్లు కూడా మనీ బిల్లు కాబట్టి దీనిపై ఓటింగ్ జరపటం సాధ్యం కాదని రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ శుక్రవారం సభలో ప్రకటించవచ్చునని తెలిసింది. రామచంద్రరావుప్రతిపాదించిన సవరణ బిల్లు మనీ బిల్లు అవునా? కాదా? అనేది నిర్ధారించేందుకు దీనిని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు పంపిస్తున్నామని కురియన్ ప్రకటించవచ్చునని అంటున్నారు. ఏదైనా మనీ బిల్లు లోక్‌సభ ద్వారా రాజ్యసభకు రావాలి కాబట్టి రామచంద్రరావు ప్రతిపాదించిన సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరపటం సాధ్యం కాదని ఆయన చెబుతారనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సవరణ బిల్లును ప్రతిపాదించిన రామచంద్రరావు మాత్రం తన బిల్లుపై ఓటింగ్ జరపాలని రాజ్యసభలో పట్టుపట్టనున్నారు. రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ సవరణ బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకు వస్తున్నందున పార్టీ సభ్యులంతా సభలో ఉండాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం విప్ జారీ చేసింది.