జాతీయ వార్తలు

రూ.5లక్షల వరకు ఐటీ మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సాధారణంగా మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి కొత్త పథకాలను, విధాన నిర్ణయాలను ప్రతిపాదించరు. ప్రభుత్వం రానున్న నాలుగయిదు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టడం సంప్రదాయం. సార్వత్రిక ఎన్నికల తరువాత కొలువు దీరే కొత్త సభలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే, సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రవేశపెట్టిన ఈ మధ్యంతర బడ్జెట్‌లో పలు జనాకర్షక పథకాలను ప్రతిపాదించడం జరిగింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.
సంవత్సరానికి రూ. అయిదు లక్షల వరకు ఆదాయం గల వారికి ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు
ప్రావిడెంట్ ఫండ్‌లు, నిర్దిష్ట ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు వాటి ద్వారా ఆర్జించే రూ. 6.5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు.
వేతన ఉద్యోగులకు స్టాండార్డ్ ట్యాక్స్ డెడక్షన్ రూ. 40వేల నుంచి రూ. 50వేలకు పెంపు
బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో చేసిన డిపాజిట్లపై వచ్చే వడ్డీపై టీడీఎస్ (ట్యాక్స్ డెడక్షన్ ఎట్ సోర్స్) విధింపు ప్రారంభ పరిమితి రూ. పది వేల నుంచి రూ. 40వేలకు పెంపు
అద్దె ఆదాయంపై టీడీఎస్ విధింపు ప్రారంభ పరిమితి రూ. 1.8 లక్షల నుంచి రూ. 2.4 లక్షలకు పెంపు
వచ్చే రెండేళ్లలో రిటర్న్‌ల ఐటీ ప్రాసెసింగ్‌ను 24 గంటల్లోగా పూర్తి చేస్తారు
పన్ను చెల్లింపుదారులు వ్యక్తిగతంగా రాకుండానే పన్ను చెల్లింపులకు సంబంధించిన అన్ని తనిఖీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే నిర్వహిస్తారు
రెండు హెక్టార్ల కన్నా తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులకు సంవత్సరానికి రూ. 6000 చొప్పున ప్యాకేజీని ఇస్తారు. ఈ పథకాన్ని ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని పిలుస్తారు
దేశీయంగా తయారు చేయనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనే సెమీ హైస్పీడ్ రైలును ప్రారంభిస్తారు
వచ్చే అయిదేళ్లలో ఒక లక్ష గ్రామాలను డిజిటల్ విలేజ్‌లుగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తారు
దేశంలోని ఈశాన్య ప్రాంతంలో వౌలిక సౌకర్యాల అభివృద్ధికి నిధుల కేటాయింపు గత సంవత్సరం 21 శాతం వృద్ధి రేటుతో రూ. 58,166 కోట్లకు పెరిగింది
పైరసీని నిరోధించడానికి ఇండియన్ సినిమాటోగ్రాఫ్ చట్టంలో యాంటీ-కామ్‌కోర్డ్ నిబంధనలనుప్రవేశపెడతారు
త్వరలోనే నేషనల్ ఆర్ట్ఫిషియల్ ఇంటెల్లిజెన్స్ పోర్టల్ ప్రారంభం
ఈఎస్‌ఐ వర్తింపు పరిమితి రూ. 21వేలకు పెంపు
కనీస పింఛను రూ. వెయ్యికి పెంపు
సంఘటిత రంగంలో రూ. 15వేల లోపు ఆదాయం గల కార్మికులకు మెగా పింఛను పథకం
మొత్తం 22 పంటలకు కనీస మద్దతు ధరను వాటి ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు పెంచుతూ నిర్ణయం
హర్యానాలో 22వ ఎయిమ్స్ ఏర్పాటు.